2014

09/10/2014

రిఅఫిలిఎషన్ మీద కోర్టు నందు రిట్ పిటిషన్ దాఖలు చేయుటకు ITI ల సమాచారము సేకరణ

ప్రియ మిత్రులారా!

APSPITIMA తరపున నమస్కారములు. 

మీకందరికీ ముందుగా తెలిపినట్లుగా మనము Re-affiliation విషయము మీద హైకోర్టు నందు రిట్ పిటిషన్ దాఖలు చేయుటకు ITI ల నుండి సమాచారము కోరుచున్నాము. మరియు డైరీ, క్యాలెండరు ప్రింటింగ్ చేయించదలచిన విషయములు కూడా మీకు విదితమే. కావున సమాచార సేకరణ కొరకు ఒక నమూనా ఫైల్ ను జతపరచబడినది. దయచేసి ఆ ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకొని దాని యందు మీ జిల్లా లోని ITI ల సమాచారము పూర్తిగా మరియు ఎటువంటి తప్పులు లేకుండా పూరించవలెను. ఫోన్ నెంబర్ మరియు ఈమెయిలు అడ్రస్ లు జాగ్రత్తగా నింపవలెను. 

గమనికలు: 1) ట్రేడులకు సంభదించిన వివరముల పట్టిక నందు ఆయా ITI ల నందుగల ట్రేడుల వివరములు మాత్రమే నింపవలెను. ఆ ITI లో లేని ట్రేడులు దగ్గర ఉన్న పట్టికను అలాగే ఖాళీగా ఉంచవలెను. అంతేకాని ITI లో లేని ట్రేడుల పేర్లు తొలగించడము గాని లేక ఆర్డర్ (క్రమము) మార్చడము కాని చేయవద్దు. 

2) పట్టిక నందు ఇచ్చిన ట్రేడుల పేర్లు కాకుండా వేరే ట్రేడులు ఏదైనా ఆయా ITI ల నందు ఉన్నచో ట్రేడుల పట్టిక సీరియల్ నెంబర్ 8 క్రింద తరువాత ఖాళీగా ఉంచిన సెల్ నందు నింపవలెను. అంతే కాని ట్రేడుల పేర్లు మార్చవద్దు. లేదా పైకి క్రిందికి జరుపవద్దు. 

3) ఒక జిల్లాకు సంబందించిన అన్ని ITI ల సమాచారము ఒకే షీట్ నందు రావలెను. దానిని జిల్లా అధ్యక్షుడు లేక జిల్లా కార్యదర్శి లేక జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ద్వారా మాత్రమే నాకు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) మరియు రాష్ట్ర అధ్యక్షులు గారికి మెయిల్ ద్వారా సమాచారము పంపవలెను. 

4) సమాచారము నేను పంపిన  ఎక్సెల్ ఫార్మాట్ లోనే నింపవలెను. ఫార్మాట్ మార్చడము కాని లేక మార్పులు కాని చేయకూడదు. 

ఇంకను ఏదైనా అదనపు సమాచారము కావలసి ఉన్నను లేక అనుమానము ఉన్నచో జిల్లా అధ్యక్షుడు లేక జిల్లా కార్యదర్శి లేక జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరైనా నేరుగా నన్ను సంప్రదించ మనవి. 

సదా మీకు మంచి జరగాలని ఆశిస్తూ... 

ధన్యవాదములతో,
మీ,

B. Sudhakar
General Secretary,
APSPITIMA. 

Note : ఈ సమాచారము అవగాహన కొరకు తెలంగాణా రాష్ట్ర సభ్యులకు కూడా పంపుట జరిగినది. అయితే తిరు సమాచారము కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యులు మాత్రమే అందజేయవలెను. తెలంగాణ రాష్ట్ర సభ్యులకు త్వరలో ఆంధ్ర రాష్ట్ర సమాచారము చేరవేత నిలిపివేయబడును. కేవలము సాధారణ (కామన్) సమాచారము మాత్రమే పంపబడును. 


 
  Proforma for Information of the Members.xlsx
35K View as HTML Scan and download

  

08/10/2014

Submission of Writ Petition in High Court on Re-affiliation issue

ప్రియ మిత్రులారా!

APSPITIMA తరపున నమస్కారములు. 

అందరికి అడ్మిషన్లు చక్కగా మరియు మంచిగా జరిగివని ఆశిస్తున్నాము. 

ఈ సందర్భమున మన తక్షణ కార్యాచరణ గురించి కూడా మనము చర్చించి తదననుగునముగా సన్నద్దము కావలసిన సమయము ఆసన్నమైనది. నిజానికి Reaffiliation కొరకు అప్లికేషన్ సమర్పించుటకు గడువు ముగిసిన సంగతి మీకందరికి విదితమే. మనము DGET అధికారులతో ఇప్పటి వరకు అనేక దఫాలుగా చర్చలు జరిపినప్పటి ఆశించిన ఫలితము రాలేదు. ఢిల్లీ వరకు వెళ్లి మీటింగ్ మరియు ధర్నా కార్యక్రమములు నిర్వహించినప్పటికీ స్పందన ఊహించినట్లుగా లేదు. అయితే ఢిల్లీ కార్యక్రమము నందు పాల్గొని విజయవంతము చేసిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరునా ధన్యవాదములు తెలుపుతున్నాము. 

ప్రస్తుత పరిస్థితులలో ఏ విధమైన కార్యాచరణ రూపొందించాలని గత కొద్ది రోజులుగా రాష్ట్ర కార్యవర్గము అనేక దఫాలుగా అనేక సందర్భములలో చర్చించిన పిదప ఈ రోజు అనగా 08.10.2014 తేదిన హైదరాబాదు నందు APSPITIMA రాష్ట్ర కార్యవర్గ ప్రత్యక్ష సమావేశము నందు అనేక రకములుగా చర్చించిన పిదప క్రింద తెలిపిన నిర్ణయాలను తీసుకోవుట జరిగినది. 

1) తక్షణమే రాష్ట్ర హైకోర్టు నందు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రముల తరుపున ఆయా రాష్ట్రాల వారు వేరు వేరు రిట్ పిటీషనులు దాఖలు చేయవలెనని తీర్మానించడమైనది. దీని కొరకు APSPITIMA నందు ప్రస్తుత సభ్యుల నుండి అఫిడవిట్ నందు సంతకము మరియు రుసుము వసూలు చేయుటకు తీర్మానించడమైనది. 

ఇటీవల కొద్ది మంది సభ్యుల నుండి వచ్చిన సమాచారము ప్రకారము తెలిసిన విషయము ఏమనగా, కేరళ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము ఆ తీర్పు మనకు కూడా వర్తించునని కావున Re-affiliation కొరకు మనము కూడా అప్లికేషను సమర్పించవలసిన అవసరము లేదని అనుకుంటున్నారని మా దృష్టికి వచ్చినది. ప్రియ సభ్యులారా! మీకందరికీ తెలియజేయు విషయము ఏమనగా, కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేవలము ఆ రాష్ట్రానికే పరిమితము, అందులోను అక్కడ పిటిషను ధాఖలు చేసిన అసోసియేషన్ వారికి మాత్రమే ఆ మధ్యంతర ఉత్తర్వులు వర్తించును. ఆ అసోసియేషన్ నందు 137 మంది సభ్యులు మాత్రమే కలరు. ఆ సంఖ్య మరియు ఆ ITI ల వివరములు వారు కేరళ హైకోర్టు నందు సమర్పించినారు కావున వారికీ మాత్రమే ఈ మధ్యంతర ఉత్తర్వులు అమలవుతాయి.  అందువలన కేరళ రాష్ట్రము లోని మిగిలిన ITI ల వారు వారికి ఉపసమనము కొరకు వేరొక పిటిషను దాఖలు చేయుటకు ప్రయత్నాలు జరుగుచున్నవి. త్వరలోనే వారు ఆ పని చేయుదురు. అంతే కాకుండా మిగిలిన అనేక రాష్ట్రాల ప్రైవేటు ITI యాజమాన్యములు కూడా ఆయా రాష్ట్రాల హైకోర్టుల యందు పిటిషన్లు దాఖలు చేయుటకు తయారవుచున్నారు.  కావున మనకు కూడా ఉపశమనము కలుగవలెనంటే మనము కూడా మన రాష్ట్ర హైకోర్టు నందు ఆయా ITI ల పేరున తక్షణమే రిట్ పిటిషను దాఖలు చేయవలెను మరియు మనకు అనుకూలముగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చు లాగున చూసుకొనవలెను. లేనిచో దాఖలు చేయని ITI లకు 2015 నందు DGET వారి ప్రస్తుత ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు నిలిపివేశదరు.  

ఈ సందర్భమున జరిగిన చర్చ మేరకు తదుపరి తీర్మానించిన విషయము ఏమనగా, 2013 నందు ఫీజుల పెంపుదల మరియు ఇటీవల జరిగిన 2014 జూలై పరీక్షల కొరకు మన అసోసిఏషణ్ తీర్మానముల మేరకు ఖర్చు పెట్టుకున్నవారికే మన సహాయ సహకారములు కల్పించబడును. అయితే ఏ కారణము చేతనైన అప్పుడు కలసి రాని యాజమాన్యములు ఇప్పుడు మన Association తొ కలసి రాదలచుకున్నచొ ఫీజుల పెంపుదల మరియు పరీక్షల పూర్తి బకాయిలు చెల్లించడముతో బాటు ఆ జిల్లాలో మిగిలిన ఖర్చులు ఏవైనా ఉన్నచో వాటిని కూడా చెల్లించి జిల్లా కార్యవర్గము ద్వారా రాష్ట్ర కార్యవర్గమును సంప్రదించవచ్చును. ఒకవేళ జిల్లాలో అభిప్రాయబేధాలు ఉన్నచో రాష్ట్ర కార్యవర్గము సలహాలతో జిల్లా కార్యవర్గము నడుచుకొనవలసినదిగా కోరుచున్నాము. అయితే ఈ విషయముల యందు ప్రస్తుతము మన అసోసియేషన్ లో ఇప్పటికే సభ్యులుగా ఉండి ముందు నుండి సహాయ సహకారములు అందించు జిల్లా కార్య వర్గ సభ్యులకు తగిన గౌరవముతో బాటు వారి అభిప్రాయములు కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర కార్యవర్గము నడుచుకొనునని హామీ ఇస్తున్నాము. ప్రత్యక పరిస్తులలో మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి కలుగ జేసుకోనుదురు.  
ఇందుకొరకు ప్రతి ITI నుండి ఖర్చుల నిమిత్తము 10000/- రూపాయలు వసూలు చేయుటకు నిర్ణయించబడినది. దీనిని 15.10.2014 లోపు వకాలత్ నందు సంతకముతో పాటు వసూలు చేయుటకు తీర్మానించడమైనది. 

2) హైకోర్టు నందు రిట్ పిటిషను దాఖలు చేయుటతో బాటు రాజకీయ పలుకుబడి ద్వారా కూడా రెండవ వైపు DGET మీద ఒత్తిడి కొనసాగించుటకు తీర్మానించడమైనది. దీని కొరకు జిల్లాలలోని సభ్యులు ఆ జిల్లాలో కల MP ల నుండి తక్షణమే సిఫారసు లేఖలు సంపాదించవలెనని తెలపడమైనది. దీనితో బాటు మన టీం ఒకటి త్వరలో ఢిల్లీ కి వెళ్లి కేంద్ర మంత్రి గారి అప్పాయింట్మెంట్  తీసుకొని మరొక దేశవ్యాప్త మీటింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయవలెనని తీర్మానించడం జరిగినది. 

3) 2015 సంవత్సరమునకు సంబంధించి APSPITIMA తరపున మన సభ్యుల వివరములతో డైరీ, గోడ క్యాలెండరు, పాకెట్ క్యాలెండరు మరియు టేబుల్ క్యాలెండరు అచ్చు వేయించుటకు తీర్మానించుట జరిగినది.  దీని యందు ప్రచార చిత్రముల ప్రచురణ కొరకు (ప్రకటనలు - Advertisement) ఆసక్తి కలవారు ఆయా జిల్లాల రాష్ట్ర కార్య వర్గ సభ్యులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాము. ప్రకటనల రేట్లు: డైరీ మరియు గోడ క్యాలెండరు నందు పూర్తి పేజి 10000/- రూపాయలుగా  నిర్ణయించబడినది.  ఆసక్తి కల సభ్యులు కావాలనుకుంటే ఇద్దరు కలసి కూడా ఒక పూర్తి పేజిని షేర్ చేసుకొనవచ్చు. 

4) జనవరి 2015 సెమిస్టర్ పరీక్షా కేంద్రాల గురించి కూడా చర్చించుట జరిగినది. దీనికి సంభదించిన పూర్తి సమాచారము మీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీ జిల్లా నందు త్వరలో ఏర్పాటు చేయబోవు మీటింగ్ నందు మీకు వివరించుదురు. 

ఇవియే కాకుండా ఇంకొన్ని విషయములు కూడా ఈ రోజు మీటింగ్ నందు చర్చించుట జరిగినది. వాటి నన్నింటిని మీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీకు మీటింగ్ నందు వివరించెదరు. 

పైన తెలిపిన సమాచారము నందు మీకు ఇంకా ఏదైన తదుపరి సమాచారము కావలసినచో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను సంప్రదించవలసినదిగా  కోరడమైనది. 

సదా మీకందరికీ శుభము జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ... 

ధన్యవాదములతో,
మీ,
బొల్లు సుధాకర్ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
APSPITIMA 

నోట్: సమాచారము కొరకు ఈ మెయిల్ ను తెలంగాణ రాష్ట్ర మిత్రులకు కూడా పంపుట జరిగినది. 

-- 
B. Sudhakar
General Secretary,
APSPITIMA,

   Inbox 

29/06/2010

Kerala High Court Interim order on Re-affiliation

Dear Sir,

Please find the attachment for Kerala High court interim order on Re-affiliation.

Regards,
B. Sudhakar
General Secretary,
APSPITIMA,
 
  Kerala High Court Interim Order on Re-affiliation 23.09.14.pdf
274K View as HTML Scan and download


29/09/2010

Hindupur MP letter on Re-affiliation and Semester system

Dear Sir,

I herewith attached a copy of Hindupur MP letter addressed to Union Labour Minister on re-affiliation and semester system. I personally and individually met Shri Nimmala Kristappa, MP, Hindupur on 27.09.14 and explained our problems towards getting of this letter. Already we have sent two MP letters of Anantapur and Kadapa Parliament Constituencies to all the members for ready reference. 

I request all the members of other districts of Andhra and Telengana States to get letters in the same manner from their respective districts MPs at an early date. So far no other district members get any letter from MPs other than Anantapur and Kadapa districts. Please try your level  best to get letters from MPs, it's most urgent and important. Don't neglect on getting letters from MPs, please speed up.

Regards,

B. Sudhakar
General Secretary,
APSPITIMA,
Hindupur MP Nimmala Kristappa letter to Minister on Re-affiliation.JPG
598K View Scan and download


Image description
Image description
Image description
Image description
Image description
Image description
Image description
Image description

Industrial training institute

Industrial Training Institutes & "Industrial Training Centers" are training institute which provide training in technical field and constituted under Directorate General of Employment & Training (DGET), Ministry of Labour & Employment, Union Government of India.

Structure

Industrial Training Institutes (ITIsd) are government-run training organisations. Industrial Training Centres (ITCs) are privately run equivalents. They provide post-school technical training. In 2002 there were 1800 ITIs, providing 373 000 training places, and 2850 ITCs providing 305 000 places. c vb 400 ITIs in India, covered under the scheme – Upgradation into Centers of Excellence Its a Vocational Training Improvement Project with World Bank Assistance.

Access to ITIs

Normally a person who has passed 10 standard (SSC) is eligible for admission to ITI. The objective of opening of ITI is provide technical manpower to industries. These persons are trained in basic skills required to do jobs of say operator or a craftsman. The course in ITI is designed in way to impart basic skill in the trade specified. The duration of course may vary from one year to three years depending upon trade opted. After completion of desired period of training the person is eligible to appear in the AITT ( All India Trade Test ) conducted by NCVT( National Council for Vocational training ). After passing AITT, the person is awarded NATIONAL TRADE CERTIFICATE (NTC)in concerning trade by NCVT. After passing ITI course a person may opt to undergo practical training in his trade in an industry for a year or two. Again the person has to appear & pass in a test to be conducted by NCVT to get the NATIONAL APPRENTICESHIP CERTIFICATE . There are both government funded and private (self-financing) ITI's in India. Most of ITI's impart training in technical trades like instrument mechanicelectricianfitterplumberdiesel mechanic, Computer Operator & Programming Assistant (COPA), electrical mechanic, Information Technology, Mechanic Computer HardwareRefrigeration & Air ConditioningTurnerWelder, etc. Industrial Training Centre (ITC's) are self-financing and provide same courses as ITI's. Trade test for ITI and ITC trainees are common. The certificate issued by NCVT are of same standard whether one had a training in Government owned ITI or privately owned ITC.

A 2003 study of the ITIs conducted under the auspices of the International Labour Organisation found that a significant imbalance had developed between the needs of the Indian economy and the training activities of the ITIs, which were producing too many graduates for skills affected by industrial decline, and too few in the emerging and informal areas of the economy.

Opportunities after ITI

People of engineering trade can go for higher studies like diploma in engineering. There are also specialised short term courses in Advanced Training Institute (ATI) which enhances the skills of candidates. ITI qualified persons can set up their own garage, motor/generator/transformer winding shops or fabrication shops depending upon trade opted. Also candidates can apply for jobs in private sector and public sectors. Government organisations like Indian Army, Navy, Airforce and also paramilitary forces like BSF, CRPF provide opportunities for ITI passed candidates of different trades.

Dear Mr Sudhakar
This we have discussed many time at different level.
There is no time for discussion
Pl advise your members to apply without  any further delay
with reg
R L Singh


On Tuesday, 19 August 2014 2:45 PM, Sudhakar B <apspitima.gs@gmail.com> wrote:

Respected Sir,

Please download the attached file for our Representation submitted on Re-affiliation of ITIs and requested to take necessary action accordingly.

Regards,
B. Sudhakar
General Secretary,
APSPITIMA,

___________________________________________________________________________________________

ప్రియ మిత్రులారా, 

మన రాష్ట్ర అసోసియేషన్ అనేక మార్లు ప్రయత్నించిన ఫలితముగా సెమిస్టర్ విదానము నందు పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి ఒక్క సారే కాకుండా 4 సార్లు పరీక్ష వ్రాయుటకు DGET వారు అనుమతి ఇచ్చినారు. దాని ఆర్డర్ కాపిని జతపరచబడినది.   


Regards,
B. Sudhakar
General Secretary,
APSPITIMA,
attemptsenhancementorderdget16.07.2014.pdf
Enter file download description here